ఈశాన్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 4.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 48 గంటలలో బంగ్లాదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు ప్రాంతంలో 3.1 km నుండి 3.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైఋతి బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాగా..గత కొన్ని రోజుల కింద తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే భారీ వర్షాల నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. ఇటు హైదరాబాద్ సైతం భారీ వర్షాలు కుదిపేసిన విషయం తెలిసిందే. భారీ వరదలతో హైదరాబాద్ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. దీంతో వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి పదివేలు ఇచ్చింది.
previous post
next post

