telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తల్లి బ్రేకింగ్ న్యూస్ చదువుతుంటే… కొడుకు ఏం చేశాడో చూడండి

News

అమెరికాలో ఓ లేడీ న్యూస్ రిపోర్టర్‌ బ్రేకింగ్ న్యూస్ చదువుతోంటే.. లైవ్‌లోకి ఒక్కసారిగా ఆమె కొడుకు వచ్చేశాడు. దీంతో ఆమె కొన్ని సెకండ్లు ఇబ్బందికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో రికార్డ్ సృష్టిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కుబె అనే మహిళ ఎన్‌బీసీ న్యూస్ చానల్‌లో పనిచేస్తోంది. బుధవారం సిరియాలో నెలకొన్న పరిస్థితులపై ఆమె లైవ్ అప్‌డేట్ ఇస్తోంది. ఇంతలో వెనక నుంచి ఆమె కొడుకు ఒక్కసారిగా లైవ్‌లోకి వచ్చేసి ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఇంతలో గ్రాఫిక్స్ డిజైనర్ ఆ సన్నివేశం కనిపించకుండా స్క్రీన్‌పై సిరియా మ్యాప్‌ను డిస్ప్లే చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను న్యూస్ చానల్ సిబ్బందే తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వర్కింగ్ మామ్స్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించి.. ఒక్కోసారి బ్రేకింగ్ న్యూస్ చెప్పే సమయంలోనే బ్రేకింగ్ న్యూస్ జరగచ్చంటూ ట్విటర్ ఖాతాలో చెప్పుకొచ్చారు. ఈ వీడియోకు గంటల వ్యవధిలోనే 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వర్కింగ్ ప్లేస్‌లోకి పిల్లలను అనుమతించడం పట్ల ఎన్‌బీసీ న్యూస్ చానల్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.

Related posts