సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన త్వరలో వెలువడనున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపిక పై దృష్టి సారించారు. జిల్లాలవారిగా సమీక్షలు నిర్వహించి బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తున్నారు. విశాఖ జిల్లాలో వైసీపీ అభ్యర్థుల కోసం పార్టీ అడదిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పరాభవం తర్వాత ఈసారి బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 స్థానాలకు గానూ కేవలం 3 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. ఈసారి సగానికి పైగా సీట్లు గెలవాలని ఆశిస్తోంది. అందుకు తగట్టుగా గెలుపు గుర్రాల కోసం వైఎస్ జగన్ అన్వేషిస్తున్నారు.
వైసీపీలో ఖరారైన అభ్యర్థుల జాబితా:
విశాఖ తూర్పు – వంశీ కృష్ణన్
విశాఖ సౌత్- మళ్ల విజయ్ ప్రసాద్
భీమిలి- అవంతి శ్రీనివాస్
అనకాపల్లి – గుడివాడ అమర్ లేదా దాడి రత్నాకర్
యలమంచిలి- కనన్ బాబురాజు
పాయకరావుపేట – పండుల రవీంద్రబాబు లేదా గొల్ల బాబూరావు
నర్సీపట్నం- పి గణేష్
చోడవరం- కరణం ధరమశ్రీ
మాడుగల – ముత్యాల నాయుడు
గాజువాక- తిప్పల నాగిరెడ్డి
అరకు – శెట్టి లత్సాలు లేదా కంభా రవిబాబు
పాడేరు- భాగ్యలక్ష్మి
దాదాపుగా 10 స్థానాల్లో స్పష్టత వచ్చినట్టు తెలుస్తున్నప్పటికీ మిగిలిన ఐదు స్థానాల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అందులో ప్రధానంగా విశాఖ నగరంలో రెండు సీట్లు, పెందుర్తి వంటివి ఉన్నాయి. ఇక పాయకరావుపేట, అరకు, అనకాపల్లి స్థానాలు మాత్రం ఇద్దరు నేతల మధ్య సందిగ్దంగా ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో మిగితా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ అదిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

