telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైసీపీ కార్పొరేటర్‌ అనుమానస్పద మృతి

ycp ap

ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 95 శాతం పైనే మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. అటు టీడీపీ పార్టీని కూడా కోలుకోలేని దెబ్బ తీసింది వైసీపీ. ముఖ్యంగా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం జరుగుతున్న వైజాగ్‌లోనూ మేయర్‌ పీఠం దక్కించుకుంది వైసీపీ. ఇది ఇలా ఉండగా.. తాజాగా విశాఖ వైసీపీలో విషాదం నెలకొంది. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా గెలుపొందిన సూర్యకుమారి ఆకస్మికంగా మృతి చెందింది. విశాఖ నగరంలోని 61వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఆమె గెలుపొందారు. విశాఖ పారిశ్రామికవాడలో నివాసముంటున్న ఆమె నివాసంతో ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సూర్యకుమారి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగి ఉంటుందా లేదా అనారోగ్యం కారణంగా మృతి చెందారా ? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Related posts