telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆ రెండు రికార్డుల పై కోహ్లీ కన్ను…

kohli century in first test with westindies

భారత జట్టు కరోనా విరామం తర్వాత మొదటి అంతర్జాతీయ సిరీస్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. అందుకోసం యూఏఈ లో ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆసీస్ కు పయనమైంది. అయితే ఈ పర్యటనలో భారత కెప్టెన్ కోహ్లీని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. క్రికెట్ చరిత్రలో 100 శతకాలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో సచిన్ ఉన్నాడు. ఆ తర్వాత 71 సెంచరీలతో రెండో స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. అయితే కోహ్లీ ఇప్పటివరకు వన్డేలో 43, టెస్టులో 27 శతకాలతో మొత్తం 70 పూర్తి చేసాడు. కాబట్టి ఈ పర్యటనలో కోహ్లీ మరో రెండు శతకాలు చేస్తే మొత్తం 72 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానానికి చేరుకుంటాడు. ఈ పర్యటనలో కోహ్లీ ఒక్క సెంచరీన ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డులో కోహ్లీ, రోహిత్ 5 శతకాలతో సమానంగా ఉన్నారు. చూడాలి మరి కోహ్లీ ఈ రెండు రికార్డులను సాధిస్తాడా… లేదా అనేది. అయితే ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.

Related posts