దట్టమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం పై విపక్షాలు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై సెలబ్రిటీల్లో చైతన్యం రావడంతో మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ స్పందించారు.
తాజాగా మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ అంశంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. అడవుల్ని ధ్వంసం చేసి మైనింగ్ చేయడం అనేది సరికాదని హితవు పలికారు. ప్రకృతిని కాపాడుకోవాలని, నల్లమలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.