తెలంగాణలో గత కొన్ని నెలలుగా పార్లమెంట్, పరిషత్ ఎన్నికల కారణంగా అమలులో ఉన్న ఎన్నికల కోడ్ శనివారంతో ముగిసింది. రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలో నవంబర్ నెల నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నది. గత డిసెంబర్ ఏడో తేదీన శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్దిరోజులు మాత్రమే ఎన్నికల కోడ్ అమలులోలేదు.
ఆ తర్వాత జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు, మేలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తాజాగా జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు వరుసగా జరుగడంతో ఎన్నికల కోడ్ చాలాకాలంపాటు అమలులో ఉన్నది. శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ల ఫలితాలు వెలువడటంతో స్థానికసంస్థల ఎ,న్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. దీంతో ఎన్నికల కోడ్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు.