telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నవరాత్రుల ఏర్పాట్ల పై విజయవాడ దుర్గ గుడి చైర్మన్…

నవరాత్రుల ఏర్పాట్ల పై విజయవాడ దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు మాట్లాడుతూ… నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. దర్శనానికి వచ్చే వాళ్ళు కచ్చితంగా కరోన నిబంధనలు పాటించాలి. ..మాస్క్ తప్పని సరి అని తెలిపారు. ఏడాది నుండి నిర్మాణంలో ఉన్న శివాలయం కూడా పూర్తయింది. రేపటి నుండి శివాలయంలో దర్శనాలకు అనుమతిస్తున్నాము అని అన్నారు. దసరాకి 74 వేల టికెట్స్ ఇప్పటికే ఆన్లైన్ లో బుక్ అయ్యాయి. ఇంకా కేవలం1500 వందలు టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా భక్తులు.. వినియోగించుకోవాలి అని సూచించారు.

దుర్గ గుడి ఈఓ సురేష్ బాబు మాట్లాడుతూ… దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుండి రావాలి. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడి ఉంటేనే అనుమతి.. మూల నక్షత్రం రోజు ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టు చీరను సమర్పిస్తారు అని పేర్కొన్నారు. ఆన్లైన్ టికెట్ సమస్యలు ఉన్నా వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి అని తెలిపారు. ఈసారి సామూహిక పూజలు లేవు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి. ఘాట్ రోడ్ లో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. విఐపి లకు ఉదయం 7 నుండి 9 వరకు సాయంత్రం 3నుండి 5 గంటలు వరకే అనుమతి ఉంటుంది అని స్పష్టం చేసారు. విఐపి లు కూడా ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలి..టైం స్లాట్ ప్రకారమే రావాలి అని తెలిపారు.

Related posts