telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ…!?

Vijay-Devarakonda

ప్ర‌స్తుతం యువ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. డిఫరెంట్ సినిమాల‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈ యువ క‌థానాయ‌కుడు న‌టిస్తోన్న చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న స్క్రీన్ నేమ్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ అని వేసుకుంటూ వ‌చ్చిన ఈ కుర్ర హీరో, తాజాగా విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోన్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` సినిమాకు స్క్రీన్ నేమ్ మార్చుకున్నాడ‌ట‌. ఈ సినిమా నుండి స్క్రీన్ నేమ్ దేవరకొండ విజయ్ సాయిగా మారింది. టీజ‌ర్‌తో ఆ విష‌యం చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. ఈ మ‌ధ్య విడుద‌లైన నోటా, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌యాలు సాధించ‌లేదు. దీంతో న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం పేరు మార్చుకున్నాడని టాక్‌. మ‌రి ఈ పేరు మార్పు ఆయ‌న స‌క్సెస్‌కు ఏ మేర‌కు దోహ‌ద ప‌డుతుందో చూడాలి.

Related posts