telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పది ఏళ్ళు పూర్తిచేసుకున్న బాలయ్య ‘సింహా’

2010 ఏప్రిల్ 30న థియేటర్లపై దండయాత్ర చేసిన బాలయ్య ‘సింహా’ సినిమా 2020 ఏప్రిల్ 30నాటికి విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. ‘లక్ష్మీనరసింహ’ తర్వాత రిలీజ్ అయిన ప్రతీ సినిమా ఫ్లాపే. ఇక బాలకృష్ణ పని అయిపోందిఅనుకుంటున్నా సందర్భంలో బోయపాటి శ్రీను లైన్లోకి వచ్చాడు. నిర్మాతగా సరైన హిట్ లేని పరుచూరి శివరాం ప్రసాద్ తన కొడుకు పరుచూరి కిరీటిని నిర్మాతగా పెట్టి, ‘సింహా’ని పట్టాలెక్కించాడు. ‘‘సింహా’’.. 2010 ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అయ్యింది. బాలయ్య ఈజ్ బ్యాక్ అంటూ అప్పటి వరకు ఎవరూ చూడని సరికొత్త బాలయ్యని రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో చూపించి బోయపాటి శభాష్ అనిపించుకున్నాడు. ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ నరసింహాగా నట‘సింహా’ నట విశ్వరూపంతో నంది అవార్డ్ అందుకున్నాడు. బాలయ్య హై ఓల్టేజ్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, చక్రి సాంగ్స్, చిన్నా ఆర్ఆర్, ఆర్థర్ ఎ.విల్సన్ ఫోటోగ్రఫీ సినిమాని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా చక్రిని నంది వరించింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ లాభాలు చవిచూశారు. అప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం తెలుగు సినీ చరిత్రలో 338 పైగా కేంద్రాలలో 50 రోజులు, 92 సెంటర్లలో 100 రోజులు, 3 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకున్న సినిమా సింహానే కావడం విశేషం. 2019 ఏప్రిల్ 30 నాటికి బాక్సాఫీస్ వద్ద బాలయ్య సింహ గర్జనచేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బాలయ్య కెరీర్‌కి ‘సింహా’తో ఊపిరి పోసి ‘‘లెజెండ్’’ వంటి బ్లాక్ బస్టర్ అందించి, ఇప్పుడు చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘‘NBK 106’’ ట్రెండ్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ సోషల్ మీడియా ద్వారా నందమూరి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts