telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జనసేన : .. ఆ ఇద్దరికీ చెడిందా.. దూరంగా ఉంటున్న జెడి…

lakshminarayana away from janasena

సిబిఐ మాజీ జెడి లక్ష్మి నారాయణ జనసేన లో చేరి విశాఖపట్నం లోక్ సభ స్థానానికి పోటీ చేసి మూడు లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఐతే ఆ తరువాత ఆయన జనసేన పార్టీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించక పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అలాగే ఆ మధ్య జరిగిన పార్టీ కమిటీల నియామకం లో అయన పేరు ఎక్కడ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ జెడి లక్ష్మినారాయణ జనసేన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ తన సొంత సంస్థ కార్యకలపాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటున్నట్లు, దీని కోసం అయన జనసైనికుల్ని కూడా వినియోగించుకుంటున్నట్లు పార్టీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కార్యకర్తల్ని మాత్రం తన ఫౌండేషన్ కార్యక్రమాల కోసం వినియోగించుకోవటంపై జనసేనాని పవన్ కల్యాణ్ కొంత గుర్రుగా ఉన్నట్లు జనసైనికులు చెబుతున్నారు. ఇదే మాజీ జేడీకి.. పవన్ కు మధ్య దూరం పెరగటానికి కారణమని ప్రచారం జరుగుతోంది. లక్ష్మీనారాయణ సన్నిహితుల వాదన మరోలా ఉంది. జనసేనలో పవన్ తర్వాత పేరున్న నాయకుడు జేడీ లక్ష్మీనారాయణేనని కానీ అక్కడ ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత లభించటం లేదని, సాధారణ కార్యకర్త లాగా గంటల కొద్దీ పవన్ ను కలిసేందుకు వెయిట్ చేయాల్సి రావడం ఏమిటని వారు తమ వాదనను వినిపిస్తున్నారు.

Related posts