telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన టీటీడీ

Tirumala

కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళుతున్నారు. ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండే తిరుమల కొండపైన కూడా మొదటిలాగా భక్తులు ఉండటం లేదు. ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇది ఇలా ఉండగా… శ్రీవారి భక్తులకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ. కళ్యాణమస్తులో భాగంగా తాలిబొట్టు బంగారం ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. కళ్యాణమస్తు ట్రెజరీలోని 20 వేల బంగారు తాళిబొట్లను కళ్యాణమస్తు కార్యక్రమానికి వినియోగించనున్నారు. తిరుమల దేవస్థానం మరోసారి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. పదేళ్ల క్రితం ఆపేసిన సామూహిక వివాహాలను మళ్లీ చేపట్టబోతోంది. పేద హిందువులు వివాహం చేసుకునేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ ట్రస్టు బోర్డు తీర్మానించింది. ఈ తీర్మానం అనంతరం వేద పండితులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్య, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపల్‌ కేఎస్‌ఎస్‌ అవధాని కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి మే 28న ముహుర్తం ఫిక్స్‌ చేశారు.

Related posts