telugu navyamedia
సినిమా వార్తలు

లిల్లీకి విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్… ఫస్ట్ సాంగ్ కు ముహూర్తం ఖరారు

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా భరత్ కమ్మ దర్శకత్వంలో “డియర్ కామ్రేడ్” చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజున అంటే ఏప్రిల్ 5న రష్మిక మందన పుట్టినరోజు. ఈ సందర్భంగా రష్మికకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ “డియర్ కామ్రేడ్”లో ఆమె లుక్ కి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. “డియర్ లిల్లీ, వి ఆర్ జస్ట్ కిడ్డింగ్, అప్‌సెట్ అవకు. నువ్వు సెట్లో మా సంతోషానివి, నువ్వు నీ పెర్ఫార్మెన్స్‌తో మాకు కళ్ల వెంట నీళ్లు తెప్పించగలవు అలాగే రోజంతా నవ్వించగలవు. ఈ నెల 8న ఉదయం 11:11 గంటలకు మేము మొదటి పాటను నీకు డెడికేట్ చేస్తాం” అంటూ ట్వీట్ చేశాడు. ఈ పాటను తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్నట్టుగా ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన “గీత గోవిందం” సంచలన విజయాన్ని సాధించడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.

Related posts