telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ నటుడు భూపేష్ కుమార్ కన్నుమూత

Bhupesh-Pandya

బాలీవుడ్ నటుడు భూపేష్ కుమార్ పాండ్యా క్యాన్సర్ తో బుధవారం కన్ను మూశారు. దర్శక నిర్మాత ముకేశ్ చాబ్రా, మనోజ్ బాజ్ పాయ్ సహా పలువురు సెలబ్రిటీలు ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. లంగ్ క్యాన్సర్ కి గురైన ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతూ వచ్చారు. బుధవారం చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. ఆయన చికిత్సకు లోగడ పలువురు నటులు విరాళాల కోసం ప్రయత్నించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 2001 బ్యాచ్ కి చెందిన భూపేష్ కుమార్ 2012లో రిలీజైన విక్కీ డోనర్, ఆ తరువాత హజారొం కీ క్వాషియే ఐసీ, గాంధీ టు హిట్లర్, ‘పరమాణు-ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ తదితర చిత్రాన్ని నటించారు.

Related posts