telugu navyamedia
రాజకీయ వార్తలు

మూడేళ్లలో రాజ్యసభ చాలా మారింది: వెంకయ్య

venkaiah Naidu Bjp

ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వెంకయ్య నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రాజ్యసభ చాలా మారిందని అన్నారు. పనిచేసే సమయం పెరిగిందని తెలిపారు. మూడేళ్లలో ఎదురైన అంశాలపై ఆయన ‘కనెక్టింగ్‌, కమ్యూనికేటింగ్‌, ఛేంజింగ్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు.

దీన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… తన మూడేళ్ల పదవీ కాలంలో దేశంలో కీలక బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. తాను మొదటి నుంచీ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నానని చెప్పారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు.

దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోందని, మహమ్మారి నుంచి కాపాడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెంకయ్య నాయుడు చెప్పారు. కరోనా నివారణ కోసం అన్ని రంగాల వారు కృషి చేస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లోనూ విసృతంగా ప్రచారం జరుగుతోందని తెలిపారు. గత ఆరు నెలలు కరోనాతో గడిచిపోయాయని చెప్పారు.

Related posts