telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్…

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలపతి విజయ్ సినిమా చేయనున్నారు. ఇప్పటికే వంశీ తన కథను స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని, విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లు, కథలో ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయనే వార్తలు విన్పించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. తాజాగా వంశీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో సినిమాపై ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. దిల్ రాజు నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో విజయ్-వంశీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉందనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అయితే తెలుగులో విజయ్ కు ఇదే మొదటి స్ట్రయిట్ చిత్రం కావడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.

Related posts