telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు వల్లభనేని వంశీ ని చికిత్స కొరకు గుంటూరు జీజీహెచ్ కు తరలింపు

పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వల్లభనేని వంశీని ఈరోజు పోలీసులు జీజీహెచ్‌ కు తరలించారు.

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.

అయితే కస్టడీ సమయంలో వంశీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కంపిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు మాజీ ఎమ్మెల్యేకు చికిత్స అందజేశారు. కానీ మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వంశీని గుంటూరు జీజీహెచ్‌ కు పోలీసులు తరలించారు.

జీజీహెచ్‌ లోవంశీకి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. కాగా జైలులో శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతున్న విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు.

దీంతో వైద్యం అందించాల్సిందిగా న్యాయధాకారి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.

ఇప్పుడు తాజాగా మరోసారి వంశీని అనారోగ్యం కారణంగా జీజీహెచ్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts