telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రివ్యూ : “వకీల్ సాబ్” దుమ్ములేపిన పవన్

రాజకీయాల కారణంగా మూడు ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో అంజలి, నివేథా థామస్‌, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇవాళ రిలీజ్ అయిన  ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
జరీనా {అంజలి}, పల్లవి{నివాదా}, అనన్య{అనన్య} ఈ ముగ్గురూ స్నేహితులు, ముగ్గురు మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిలైన వీళ్లు హైదరాబాద్లో జాబ్స్‌ చేసుకుంటూ ఉంటారు. ఐతే ఒకరోజు రాత్రి పార్టీ నుంచి క్యాబ్‌లో వెళ్తూ.. అనుకోకుండా వంశీ{విలన్‌} గ్యాంగ్‌తో వాళ్ల రిసార్ట్‌కు వెళతారు. అయితే.. అక్కడ జరిగిన ఒక సంఘటన వాళ్ల జీవితాలను మలుపు తిప్పుతుంది. వీళ్లపై కోర్టు లో కేసు ఫైల్‌ అవుతుంది. ఏ దిక్కూ లేని ఈ అమ్మాయిల పక్షాన వకీల్‌ సాబ్‌ సత్యదేవ్‌ {పవన్‌ కళ్యాణ్‌} నిలుస్తాడు. బలహీనులకు బలాన్ని ఇచ్చే వకీల్‌ సాబ్‌ ఈ అమ్మాయిలకు ఎలా న్యాయం జరిగేలా చేశాడు? బలమైన లాయర్‌ నందా {ప్రకాష్‌ రాజు} ను మరియు బలవంతమైన నిందితులను ఎలా ఢీ కొన్నాడు? అసలు పేదల వైపు నిలబడే వకీల్‌ సాబ్‌ ఎందుకు తాగుడిని అలవాటు చేసుకుని జీవితంలో ఎందుకు ఒంటరిగా మిగిలాడు? ఇవన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్‌ పాయింట్స్‌ :
ఈ సినిమాకు ప్రధాన బలం, బలగం పవన్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణే. లాయర్‌ పాత్రలో అద్భుతంగా నటించాడు. అటు ప్రకాష్‌రాజు కూడా తన పాత్రలో నటించేశాడు. ప్రకాష్‌, పవన్‌ మధ్య జరిగే కోర్టు సన్నివేశాలు ఈ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకుపోయాయి.

మైనస్ పాయింట్స్ :

స్టోరీ సెటప్‌ అండ్‌ ట్రీట్మెండ్‌ బాగున్నా.. ప్లాష్‌ బ్యాక్‌లో వచ్చిన లవ్‌ స్టోరీ సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. ఇంట్రస్టింగ్‌గా సాగుతున్న సినిమాలో అంత ఎఫెక్టివ్‌గా సాగని హీరో లవ్‌ ట్రాక్‌, లవ్‌లో పడే సీన్స్‌తో కథను డైవర్స్‌ చేశారనపించినా.. అది ఎక్కువ సేపేఉ సాగదు కాబట్టి…. ప్లేకి వచ్చిన నష్టం ఏం లేదు. కొన్ని సీన్స్‌ ఫ్యాన్స్‌ కు నచ్చినా.. రెగ్యులర్‌ ఆడియన్స్ నచ్చలేదు.

రేటింగ్ : పేదలకు న్యాయం చేయడానికి వకీల్‌ సాబ్‌ గా మారి… న్యాయం చేయడం కోసం ఎవరిని వదలడు అంటూ వచ్చిన ఈ సినిమా చాలా బాగుతుంది. పవన్‌ ఫ్యాన్స్‌ ఫ్యాన్స్‌ కు మంచి కిక్‌ ఇస్తుంది. లాక్‌డైన్‌ తర్వాత ఈ సినిమా ప్రేక్షకులకు పెద్ద పండగే.
ఈ సినిమాకు 3.5/5 రేటింగ్‌ ఇవ్వచ్చు.

Related posts