telugu navyamedia
సినిమా వార్తలు

“గల్లీబాయ్” సూపర్ : బాలీవుడ్ స్టార్ విల్ స్మిత్

will-smith-and-ranveer-singh

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ర్యాపర్ గా నటించిన చిత్రం “గల్లీబాయ్”. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఓ యువ గాయకుడు తన కలలను ఎలా నిజం చేసుకున్నాడన్న కథను “గల్లీబాయ్” ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ఈ సినిమాపై స్పందించారు. హీరో రణ్ వీర్ సింగ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

“యో.. రణ్ వీర్ సింగ్. కంగ్రాట్స్. నువ్వు గల్లీబాయ్ లో చేసిన నటన నాకు చాలా బాగా నచ్చింది. హిప్ హాప్ ను ప్రపంచవ్యాప్తంగా చూడటం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ మ్యాన్” అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విల్ స్మిత్ పోస్ట్ చేశారు. కాగా, విల్ స్మిత్ ప్రశంసించడంతో రణ్ వీర్ అభిమానులు సంబర పడిపోతున్నారు. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన గల్లీ బాయ్ లో రణ్ వీర్ కు జోడీగా ఆలియా భట్ నటించింది.

Related posts