టాప్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’. ముంబై రెడ్ లైట్ ఏరియాలో డాన్ గా ఎదిగిన ఓ ‘మేడమ్’ కథే ఈ సినిమా. తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు ‘గంగూబాయ్’ మూవీని. అయితే, కొన్నాళ్ల క్రితం సినిమా టీజర్ హిందీ వర్షన్ విడుదలైంది. యూట్యూట్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఇప్పుడు తెలుగు టీజర్ ను ఫిల్మ్ మేకర్స్ రిలీజ్ చేశారు. తన కెరీర్ లో ఇప్పటి వరకూ చేయని బోల్డ్ క్యారెక్టర్ ఆలియా ‘గంగూబాయ్’లో చేసింది. ఓ వేశ్యగా, లేడీ డాన్ గా, ముంబైలోని కామాతిపురకు ‘మేడమ్’గా ఆమె అనేక షేడ్స్ చూపించగలిగింది టీజర్ లో. అయితే, ట్రైలర్ కూడా మన ముందుకు వస్తే… జూలై 30న విడుదలవుతోన్న సినిమాపై మరింత క్లారిటీ వస్తుంది. ‘గంగూబాయ్ కతియావాడి’ సినిమాలో అజయ్ దేవగణ్, హ్యూమా ఖురేషి లాంటి నటీనటులు కూడా ఉన్నారు. ఆలియా ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకుంది. నటిగా తనను తాను నిరూపించుకునే మంచి అవకాశం ఆమెకు ఈ సినిమాలో లభించిందని ఇండస్ట్రీ టాక్.
previous post