telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా” ఎందుకు చూడాలి ?… మెగాస్టార్ కు కోడలి ప్రశ్న

Chiru

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న చిత్రం “సైరా న‌ర‌సింహారెడ్డి”. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఇటీవల మెగా కోడలు ఉపాసన చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఉపాసన చిరుకి ఆసక్తికర ప్రశ్నలు సంధించింది. “మావయ్య.. సైరా చిత్రాన్ని యువత ఎందుకు చూడాలి అంటే ఏం చెబుతారు ?” అని ప్రశ్నించింది. దీనికి చిరు సమాధానం ఇస్తూ “సైరా చిత్రం యువతకు చాలా ముఖ్యమైనది. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛని, స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నాం. దీని వెనుక ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగం దాగిఉంది. ఆ త్యాగాలని ప్రస్తుత తరం క్రమంగా మరచిపోతోంది. వీరుల త్యాగాలు మరుగునపడిపోతున్నాయి. ఎందరో వీరుల ప్రాణత్యాగాల గురించి వింటున్నప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సైరా చిత్రం అలా ఉండబోతోంది” అని చిరంజీవి తెలిపారు.

Related posts