telugu navyamedia
రాజకీయ

ఇంటికా.. జైలుకా..ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి..

మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబైలో డబ్బే ఉండదని గవర్నర్ భగత్‌ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు పై క్షమాపణలు చెప్పాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.

ముంబైలోని తన నివాసం ‘మాతోశ్రీ’లో విలేకరుల సమావేశంలో థాకరే మాట్లాడుతూ..”గవర్నర్ మరాఠీ ప్రజలపై తన మనస్సులో ఉన్న ద్వేషం అనుకోకుండా బయటపడిందని అన్నారు. మరాఠీ ప్రజలకు గవర్నర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

భగత్ సింగ్ కోశ్యారి వ్యాఖ్యలు మరాఠీ బిడ్డలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ఆయన గవర్నర్‌ పదవికి అగౌరవం తెచ్చారని థాకరే ఆరోపించారు. ముంబై, థానేలలో శాంతియుతంగా జీవిస్తున్న హిందువులను విభజించేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.ఆయనను ఇంటికి పంపుతారో లేక జైలుకు పంపుతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు.

భగత్ సింగ్ కోశ్యారి గౌరవ పదవిని చూసి ఇంకా ఎంతకాలం సైలెంట్‌గా ఉండాలో తనకు అర్థం కావడం లేదని థాక్రే అన్నారు. గవర్నర్ పదవిని చేపట్టేవారు కనీసం వారు కూర్చునే కుర్చీనైనా గౌరవించాలన్నారు.

Related posts