నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. త్రిగర్తల సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపత్యం వహించే బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు.ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు
శుక్రవారం నాడు ఈ మూవీ బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అతడి సోదరుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చాడు.
ఈ సందర్భంగా మీకు నచ్చేవరకు చిత్రాలు చేస్తూనే ఉంటాం… మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత అని అన్నాను. ఈ సినిమా విడుదల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ గారు కలర్ ఎంత పైకి ఎత్తుతారో మీరే చూస్తారు. కళ్యాణ్ అన్న కెరీర్ బింబిసార ముందు, తర్వాత అనేలా ఉంటుంది” అని తెలిపారు
ఇండస్ట్రీకి గడ్డు కాలం అంటున్నారు.. థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు. ఇదంతా నేను నమ్మను” అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. అద్భుతమైన సినిమా వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షకులంతా దేవుళ్ళు మీరందరు ఆయన చెప్పారు.
తన స్పీచ్‌తో అదరగొట్టాడు. మా తాతగారు (ఎన్టీఆర్), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటామని అన్నారు. ‘బింబిసార’ సినిమాలో, ఆ పాత్రలో కళ్యాణ్ రామ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని ఎన్టీఆర్ అన్నారు.
‘బింబిసార’ను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని ఆయన కోరారు.’బింబిసార’తో పాటు వచ్చే ‘సీతా రామం’ సినిమాను కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు