telugu navyamedia
సినిమా వార్తలు

స్టార్ హీరోకు భార్య వార్నింగ్

Akshay-Kumar-and-Twinkle-Khanna

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కు వార్నింగ్ ఇస్తూ ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్ “ది ఎండ్” అనే వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కుమార్ నిప్పటించుకుని స్టేజ్ పై నడిచారు. ఈ హీరో రియల్ స్టంట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. కానీ ఆయన భార్యను మాత్రం ఆగ్రహానికి గురి చేసింది.

దీంతో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా “నీ ఒంటికి నువ్వే నిప్పంటించుకున్నావ్… ఆ తరువాత కూడా నువ్వు బతికే ఉంటే ఇంటికి రా… నిన్ను నేను చంపేస్తా…” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన అక్షయ్ కుమార్ “ఇప్పుడు నాకు ఈ విషయంలో భయంగా ఉంది… దేవుడా నన్ను కాపాడు” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సెలెబ్రిటీ కపుల్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తన కొడుకు ఆరవ్ సూచన మేరకు “ది ఎండ్” వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టుగా వెల్లడించారు అక్షయ్ కుమార్. సినిమా విషయానికొస్తే… “కేసరి”, “సూర్యవంశీ” లాంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు అక్షయ్. ఆయన నటించిన పీరియాడిక్ డ్రామా “కేసరి” త్వరలోనే విడుదల కానుంది.

Related posts