telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేక్షకులకు “ఆర్ఆర్ఆర్” ఆఫర్… టైటిల్ మీరే చెప్పండి

RRR

రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” అనే టైటిల్ తో భారీ మల్టీస్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, రామ్ చరణ్ కు జోడిగా సీత ఏ పాత్రలో అలియా భట్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, ఎన్టీఆర్ కు జోడిగా డైసీ ఎడ్గార్ జోన్స్ ను ఎంపిక చేసినట్లుగా రాజమౌళి వెల్లడించారు. ఈ చిత్రం దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2020 జూలై 30 నాటికీ సినిమా విడుదలవుతుంది. అన్ని భాషలకు ఆర్.ఆర్.ఆర్ కామన్ టైటిల్. కానీ ప్రతి భాషకు ఒక్కో టైటిల్ ఉంటుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. తాజాగా ఈ భారీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” సినిమాకు మంచి టైటిల్ చెబితే, అందులో బాగున్న టైటిల్ ను ఎంపిక చేసి సినిమాకు పెట్టేందుకు ఆలోచిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన కథ అందరికీ తెలుసునని, దాని ఆధారంగా “ఆర్ఆర్ఆర్” అంటే అబ్రివేషన్ చెప్పాలని, అభిమానులు తమ సొంత అబ్రివేషన్స్ తో రావాలని, వాటిని రాజమౌళి స్వయంగా పరిశీలిస్తారని, అభిమానులు తమ టైటిల్స్ ను ట్వీట్ చేయాలని సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రేక్షకులను కోరింది.

Related posts