telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

`టక్ జగదీష్` నుంచి అదిరిపోయే అప్డేట్..

నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తనదైన నటనతో నాచురల్ స్టార్‌గా బిరుదు అందుకున్నాడు. ప్రతి సినిమాలో పక్కింటి కుర్రాడిలా ప్రేక్షకుడికి దగ్గరవుతూ వచ్చాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శివ నిర్వానా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ మరో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ప్రముఖ నటులు జగపతి బాబు, నరేష్, రావు రమేష్, నాజర్ తదితరులు కనిపించారు. అయితే… తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ “ఇంకోసారి…” లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేయబోతోంది. తమన్‌ స్వరపరిచిన ఈ మ్యాజికల్‌ మెలోడీని ఈ నెల 13న ఉదయం 9 గంటలకు రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. 

Related posts