telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: ఆర్టీసీ ఐకాస

rtc protest started with arrest

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లో చేరాలని… విధుల్లో చేరని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ ఆర్మీసీ కార్మికులు ఏమాత్రం తగ్గలేదు. తమ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు అశ్వద్థామరెడ్డి మాట్లాడుతూప్రభుత్వం విధించే డెడ్‌లైన్లకు కార్మికులు బెదరబోరని స్పష్టం చేశారు.

సమ్మె విషయంలో వెనక్కి తగ్గబోమని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఐకాస అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డితోపాటు పలువురు నేతలు ఎంజీబీఎస్‌ను సందర్శించారు. సమ్మె జరుగుతున్న తీరును పరిశీలించారు. కార్మికులంతా సమ్మెలో పాల్గొంటూ దిగ్విజయం చేస్తున్నారని వారు అన్నారు. ఇకనైనా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంజీబీఎస్‌ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెతో కార్మికులు నైతిక విజయం సాధించారని ఐకాస నేతలు పేర్కొన్నారు.

Related posts