తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన….. సాయంత్రం 4 గంటలకు తెరాస శాసనసభపక్షం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న ఎల్పీ భేటి జరుగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులకు సమావేశానికి ఆహ్వానం పంపారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం కోసం రాష్ర్టంలోని నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టింది.
కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరిగే టీఆర్ఎస్ శాసనసభా పక్షం భేటీలో భవిష్యత్తు కార్యచరణ ఖరారు చేయనున్నారు.. కేంద్ర ప్రభుత్వం ఒక తీరుగా… రాష్ట్ర భాజపా మరోతీరు వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తోందని తెరాస ఆరోపిస్తోంది. ఇవాళ
ఈ నెల 29 న తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం వైఖరి, రాష్ట్రానికి జరగుతున్న అన్యాయం, భాజపా నేతలు అనుసరిస్తున్న వైఖరితోపాటు.. విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే వరంగల్ బహిరంగ సభ వాయిదా పడిన నేపథ్యంలో ఆ దశగా నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులపైనా కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.