telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికీ నిజం: వైఎస్ షర్మిల

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికీ నిజమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 2018-19 పొలిటికల్ టైమ్‌లో తెలంగాణా సిఎంగా కేసీఆర్, ఏపీ సిఎం జగన్‌గా ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండే వారని గుర్తు చేశారు.

ఈ పోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరి సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆమె అభివర్ణించారు. వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ  నా ఫోన్, నా భర్త ఫోన్ టాప్ అవుతుందని తమకు స్పష్టంగా అర్థమైందన్నారు.

వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని నాతో పేర్కొన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. తమ ఫోన్ సంభాషణ నాకే వినిపించారని చెప్పారు.

ఈ విషయం సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా? అంటే నాకు అనుమానమేనన్నారు. ఏ విచారణకు ఆయినా బైబిల్ మీదా నా బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్పగలనని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ ఆడియోలు నాకే వినిపిస్తే ఇది ఇల్లీగల్ కూడా అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణాలో చేస్తున్నా అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ విషయం చిన్నదిగా అనిపించిందని అందుకే ఈ అంశాన్ని బయటకు చెప్పలేక పోయానని వైఎస్ షర్మిల వివరించారు.

నా రాజకీయ భవిష్యత్ నాశనం చేయటానికే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారని మండిపడ్డారు. నాకు అండగా నిలబడ్డా వారికి సైతం బెదిరింపులు చేశారని గుర్తు చేశారు.

నేను ఊపిరి తీసుకోవడమే కష్టమన్నట్లుగా వైఎస్ జగన్ వ్యవహరించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తమని ఆమె ప్రకటించారు. అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. నేను ఫిర్యాదు చేయాలనుకుంటే ఆస్తులు పంచిన రోజే ఫిర్యాదు చేసే దానిని ఆమె పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగాలని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ఆకాంక్షించారు.

విశాఖపట్నం జిల్లా పర్యటన కోసం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖపట్నం బుధవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా వైఎస్ షర్మిల అరకు వెళ్లనున్నారు.

Related posts