telugu navyamedia
సినిమా వార్తలు

మ‌రోసారి మెగాస్టార్‌తో ఛాన్స్ కొట్టేసిన త్రిష‌..

మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ ఆరు సినిమాల వరకూ లైన్లో పెట్టాడు చిరంజీవి.

ఇందులో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ‘గాడ్​ఫాదర్’​, ‘భోళాశంకర్’​, ‘వాల్తేరు వీర్రాజు’ సినిమాల్లో నటిస్తున్నారు చిరు.

Stalin Movie - Go Go Goa Full Video Song - Chiranjeevi, Trisha - YouTube

తాజాగా యంగ్​ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు మెగాస్టార్. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈసినిమాకు సబంధించిన పనులు చకచకా చేసుకుంటున్నాడట డైరెక్టర్ వెంకీ కుడుముల .ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది.

Chiranjeevi opens up on Trisha Krishnan's exit from Acharya | Telugu Movie News - Times of India

ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదట శ్రుతిహాసన్ పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్​గా త్రిష ఎంపికైనట్లు తెలుస్తోంది. గ‌తంలో త్రిష తొలిసారిగా ‘స్టాలిన్​’ చిత్రంలో మెగాస్టార్​ సరసన నటించారు. ఈ చిత్రం 2006లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ పదహారేళ్లకు చిరు సరసన ఆమె మరోసారి ఛాన్స్ కొట్టేసింది.

Related posts