telugu navyamedia
రాజకీయ

రైల్వే చ‌రిత్ర‌లో..ఇదే మొద‌టి సారి..

ఝార్ఖండ్​లోని జంషెద్​పుర్ లో ఓ మహిళ రైల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ట్రైన్లో పురిటి నొప్ప‌లు వ‌చ్చేస‌రికి.. ట్రైన్‌ టాటా నగర్ రైల్వే స్టేషన్ దాటి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ప్ర‌యాణిస్తుంది.. ఆ తర్వాతి స్టేషన్ 150 కి.మీ దూరంలోని ఉన్న హిజ్లికి చేరుకోవాలంటే కనీసం రెండున్నర గంటలు పడుతుంది. త‌ల్లి బిడ్డ క్షేమం కోసం అధికారులు ట్రైన్‌ను వెనక్కి మళ్లించారు.

వివ‌ర్లాలోకి వెళితే..
టాటా నగర్ నుండి భువనేశ్వర్ కు రాణు దాస్ అనే మహిళ సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్ ఎక్కారు. ఎస్5 కోచ్​లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చిన ఈ రైలు.. బుధవారం తెల్లవారుజామున 3.55 గంటలకు జంషెద్​పుర్ సమీపంలోని టాటానగర్ స్టేషన్​కు చేరుకుంది. 4.10 గంటలకు ప్లాట్​ఫాం నుంచి బయల్దేరింది. స్టేషన్ దాటిన అనంతరం ఆమెకు పురిటినొప్పులు రావ‌డంతో కుటుంబ సభ్యులు చైన్ లాగారు..పురిటి నొప్పులు ఎక్కువై.. రైల్లోనే ప్ర‌స‌వించింది. కానీ అప్పటికే రైలు దాదాపు రెండున్నర కిలోమీటర్లు స్టేష‌న్ దాటేసింది.

Jamshedpur: Train rolls back 2.5 km for medical attention to mother and  newborn | The Avenue Mail

రైలు ఆగినట్లు తెలుసుకున్న ఆర్​పీఎఫ్ సిబ్బంది.. టాటానగర్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. తర్వాత మహిళ ప్రసవం గురించి వారికి తెలిసింది. మహిళ పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​ను వెనక్కి పిలిపించారు. టాటానగర్​ స్టేషన్​లో అంబులెన్సును ఏర్పాటు చేసి.. మహిళను ఖాస్మహాల్ సద‌ర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శిశువును ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం త‌ల్లి బిడ్డ‌ సురక్షితంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా.. రైల్వే చ‌రిత్ర‌లో ఎప్ప‌డూ ట్రైన్ వెన‌క్కి రావ‌డం జ‌ర‌గ‌లేదు..ఇదే మొద‌టి సారి.

Related posts