ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్కినేని నాగార్జున కలిశారు. ఆయన వెంట తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ప్రొడ్యూసర్స్ ప్రీతమ్ రెడ్డి, నిరంజయ రెడ్డి కూడా ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న హీరో నాగార్జున.. సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ను కలిశారు.
ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే .. సీఎం జగన్తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు.తెలుగు సినీ పరిశ్రమలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు విజయవాడకు నాగార్జున టీమ్ చేరుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రాజధానిలో రియల్ రంగం పడిపోయింది: చంద్రబాబు