telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా : రేవంత్ రెడ్డి

మనకు గుర్తింపు రావాలంటే సమర్దుడైన ఆటగాడితో పోటీపడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

“పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకు వచ్చింది.

గతంలో నేను 12 గంటలే పనిచేస్తే చాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18 గంటలు పని చేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు, సహచరులతో చెప్పాను” అని బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

శనివారం బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి తెలంగాణలో త్వరలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల్లో వైద్యరంగంలో రాణించిన సంస్థలకు అవకాశం ఇస్తామన్నారు.

అన్ని రకాల జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామన్నారు.

Related posts