తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల తరఫున గెలిచిన శాసన సభ్యులను తమ పార్టీలోకి లాక్కుంటూ కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూనే ఉన్నారని విమర్శించారు.
దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు కేసీఆర్ కు గుర్తుచేసినా ప్రయోజనం లేకపోయిందని వ్యాఖ్యానించారు.. తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాల్సిందిగా పిటిషన్లు అందజేశామని భట్టి పేర్కొన్నారు.
చేపపిల్లలను వదిలిన మంత్రి జగదీష్ రెడ్డి…