telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాజల్‌, తమన్నాలాగా నేను మెథడ్‌ ఆర్టిస్ట్‌ను కాను… హీరో కామెంట్స్

Tenali

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. జ‌వ్వాజి రామాంజ‌నేయులు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రం యుబైఏ సర్టిఫికెట్‌ని పొందింది. సెన్సార్ నుంచి ప్రశంసలు అందుకున్న ‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’ టీమ్.. చిత్ర విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన సాంగ్స్‌కి, టీజ‌ర్‌కి, రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. హీరో సందీప్ కిష‌న్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని జి.నాగేశ్వ‌రరెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా మంగళవారం సందీప్‌ విలేకర్లతో మాట్లాడారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ “కర్నూల్‌ టౌన్‌లో చిన్న చిన్న కేసుల్ని వాదించే రామకృష్ణ అనే లాయర్‌ కథ ఇది. ‘చిన్న కేస్‌ తీసుకోవాలి న్యాయంగా కోర్డులో గెలవాలి’ అన్నదే అతని లక్ష్యం. అలాంటి లాయర్‌కు ఓ పెద్ద కేస్‌ వస్తే ఏం జరిగింది అన్న విషయాన్ని పూర్తి వినోదాత్మకంగా చెప్పాం. నవ్విస్తూ న్యాయాన్ని నిలబెట్టే పాత్ర నాది.  చాలాకాలం తర్వాత హిలేరియస్‌ కామెడీ సినిమా చేశా. రాజసింహ ఇచ్చిన కథకు నాగేశ్వరరెడ్డి లాంటి క్లారిటీ ఉన్న దర్శకుడు దొరకడం అదృష్టం. ఆయన టైప్‌ కామెడీతో ప్రేక్షకుల్ని పడిపడి నవ్వేలా చేస్తుందీ సినిమా. హన్సిక పాత్ర ఆకట్టుకుంటుంది. రిస్కీ షాట్స్‌ చేయడానికి ఏ మాత్రం భయపడని నాకు గ్లాస్‌ బ్లాస్టింగ్‌, బైక్‌ రేసింగ్‌ వంటి సన్నివేశాలు చేయడమంటే మాత్రం చాలా భయం. ఈ సినిమా షూటింగ్‌లో గ్లాస్‌ బ్లాస్టింగ్‌ సీన్‌ చేస్తునప్పుడు ఓ ప్రమాదం జరిగింది. అద్దం పగిలి నా కంటి కింద గుచ్చుకుంది. అదృష్టవశాత్తు కంటికి ఏమీ కాలేదు. కథలో కామెడీ ఉండాలి. కానీ, కామెడీ కోసం కథ తయారు కాకూడదు. అలాగే యాక్టింగ్‌ నేచురల్‌గా ఉండాలి. కాజల్‌, తమన్నాలాగా నేను మెథడ్‌ ఆర్టిస్ట్‌ను కాను. నటన స్పాంటేనియస్‌గా ఉండాలి కానీ ప్రిపేర్‌ అయినట్లు ఉండకూడదు. ‘నిను వీడని నీడను నేనే’ సినిమా విడుదల చేయడానికి కష్టాలు పడినా నిర్మాతగా ఆ సినిమాతో చాలా హ్యాపీగా ఉన్నా. నా ప్రొడక్షన్‌ హౌస్‌ని కంటిన్యూ చేస్తాం. ఇటీవల ఓ మంచి కథ విన్నా. దానిని రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా చేద్దామనుకుంటున్నా. ప్రస్తుతం హాకీ నేపథ్యంలో ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా చేస్తున్నా. దాని కోసం ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. రెండేళ్లుగా నేను న్యూ ఏజ్‌ స్టోరీస్‌, ఇంటెన్స్‌ ఉన్న కథల వెంటపడి గాడి తప్పాను. మధ్యలో రీమేక్‌లు చేద్దామనీ ప్రయత్నించాను. ఇప్పుడు కథల విషయంలో ఆచితూచి ముందుకెళ్తున్నా. మంచి కథ లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను కానీ ఫ్లాప్‌ కథల జోలికి మాత్రం వెళ్లను. ‘ప్రస్థానం 2’ చేయాలనే ఐడియా లేదు. కానీ దేవ కట్టాతో ఓ సినిమా చేస్తా” అని తెలిపారు.

Related posts