telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ మరో వారం లాక్ డౌన్ పొడగింపు ?

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టితో 18 రోజుల లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు, తదితర అంశాల మీదపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వీక్ ఎండ్ లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ వైపు అడుగులు అడుగులు వేస్తోంది ప్రభుత్వం. రాత్రి 7 నుంచి కర్ఫ్యూ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అటు జూన్ నెలలో కూడా లాక్‎డౌన్ అమలు చేస్తారా అన్న ప్రశ్న కూడా తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠగా మారింది. లేక ఇదే పరిస్థితి ఉంటే మరిన్ని సడలింపులు ఇస్తారా అనే అంశంపై కేబినెట్ సమావేశం అనంతరం సమాచారం రానుంది. లాక్‎డౌన్‎పై స్పష్టత రావాలంటే మరో కొన్ని గంటలు వేచివుండాలి. ఇక ప్రస్తుతం తెలంగాణలో ప్రస్తుతం 20 గంటల లాక్ డౌన్ అమలులో ఉంది. కాగా తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి.  గత 24 గంటల్లో 3527 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో 19 మృతి చెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 571044 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 530025 మంది కోలుకున్నారు. 

Related posts