telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజెపీ పార్టీకి మద్దతు ప్రకటించేసిన కాంగ్రెస్

కేరళలో కాంగ్రెస్ తన పూర్తి మద్దతును బీజేపీకి తెలుపడాన్ని రాష్ట్ర పర్యాటక మంత్రి కడకంపల్లి సెరేంద్రన్ తప్పు పట్టారు. బీజేపీ కుట్రలను విజయవంతం చేయడానికే కాంగ్రెస్ ఇటువంటి నిర్ణయం తీసుకుందన్నారు. అధికారం కోసమే కాంగ్రెస్ ఈ పని చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ కేవలం తన స్వలాభానికి మాత్రమే పని చేస్తుందని, తన అధికారాన్ని తిరిగి దగ్గించుకునేందుకే కాంగ్రెస్ ప్రణాళిక వేస్తుందన్నారు. ‘కాంగ్రెస్ తిరిగి గద్దె ఎక్కాలని చూస్తుంది. అందుకోసం కాంగ్రెస్ ఏమైనా చేసేందుకు సిద్దంగా ఉంది. అందులోభాగంగానే బీజేపీకి తన మద్దతును తెలిపింది. ప్రత్యర్థుల నోళ్లు మూయించేందుకు బీజేపీతో కుట్ర చేస్తుంది. అధికారం కోసం రానున్న ఎన్నకల్లో స్థానిక పార్టీలతో చేతులు కలపడానికి కూడా కాంగ్రెస్ వెనుకాడద’ని ఆయన అన్నారు. ‘రాష్ట్రంలో లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మహమ్మారి కరోన సమయంలో సంక్షేమ పథకాలు, పెన్షన్లు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశాయి. దీంతో ప్రత్యర్థులు ముఖ్యంగా కాంగ్రెస్ వారు దీనిని చూసి ఓర్వలేక పోయారు. అందుకనే సంక్షేమ పథకాలపై ప్రజలలో తప్పుడు ప్రచారం చేస్తున్నార’ని చెప్పారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన తప్పుబట్టారు. భారతీయ జనతా పార్టీ జాతీయ సంస్థలను స్వలాభాలకోసం ఉపయోగించుకుంటుందని, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా పాచికలు విసురుతోందని అన్నారు. అదే తరహాలో రాష్ట్రంలో లెఫ్ట్ ప్రభుత్వం పై కూడా పన్నాగాలు పన్నిందని, పక్క రాష్ట్రాల్లో చేసిన తీరును గమనించవచ్చని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే రాబోతున్న బాడీ పోల్స్‌ను కూడా ఆయన ప్రస్తావించారు. రానున్న పోల్స్‌లో మళ్లీ లెఫ్ట్ పార్టీలు గెలుచుందుకే అవకాశాలు ఉన్నాయని, ఎల్‌డీఎఫ్ తన అదికారారన్ని కొనసాగిస్తొందని, ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రత్యర్థులు అబద్దపు ప్రచారాలు చేశారన్నారు. అయితే ఈ ఎన్నకలు డిసెంబరు 8నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవి మూడు విడతలుగా జరగనున్నాయి.

Related posts