telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మలైకా అరోరాకు కరోనా పాజిటివ్

Malaika

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు అర్జున్ కపూర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, ఆయన ప్రేయసి మలైకా అరోరాకు కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మలైకా అరోరా చెల్లెలు అమృత అరోరా ఓ జాతీయ మీడియాకు చెప్పారు. అర్జున్ కపూర్ – మలైకా అరోరా తమ ప్రేమ విషయాన్ని కిందటేడాది అధికారికంగా ప్రకటించారు. నిజానికి మలైకా అరోరాకు గతంలో పెళ్లయింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్హాన్ ఖాన్ ఉన్నాడు. అర్బాజ్ ఖాన్ నుంచి 2017లో మలైకా విడిపోయారు. అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య సుమారు 18 సంవత్సరాల వయసు తేడా ఉండడం గమనార్హం.

Related posts