telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీవారి భక్తులకు షాక్.. నిలిచిన ఆన్ లైన్ టికెట్లు..?

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ షాక్..ఆన్ లైన్ దర్శనం కోటాను పెంచడంతో.. ఈజీగా టికెట్లు దొరుకుతాయని చాలామంది ఆశించారు. కానీ అనూహ్యంగా టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది..

ఈ రోజు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో టెక్నికల్ సమస్య తలెత్తింది. ఈ టెక్నికల్ సమస్య వల్ల టికెట్లు విడుదల చేసినా… భక్తులు బుకింగ్‌ చేసుకోలేకపోతున్నారు. ఉదయం 9 గంటలకు టికెట్లు విడుదల చేయగానే వచ్చిన సమస్య… 12 గంటల కల్లా పరిష్కరిస్తామని టీటీడి వెల్లడించింది. ఆ తర్వాత భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చునని తెలిపింది.

క‌రోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమల శ్రీవారి దర్శన టోకెన్ల కోటాను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆ టోకెన్లను ఈరోజే విడుదల చేసింది కూడా.. ముందే టోకెన్లు పెంచుతున్నట్టు సమాచారం ఉండడంతో.. చాలాకాలంగా శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులంతా పోటీ పడ్డారు.. మార్చిలో టోకెన్లు దొరుకుతాయి అనుకునేవారందికీ టీటీడీ షాక్ ఇచ్చింది. టెక్నికల్ సమస్య కారణంగా.. ఆన్ లైన్ టికెట్ల జారీ నిలిపివేసింది.

ఇప్పటి వరకు రోజుకు 15వేల సర్వదర్శన టికెట్లు ఇస్తుండగా.. మార్చి నెల నుంచి రోజుకు 20 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో అందజేయనున్నట్లు తితిదే వెల్లడించింది. ఇకనుంచి తిరుపతి కౌంటర్లలో రోజుకు 20 వేల చొప్పున జారీ చేస్తున్న సర్వదర్శన టికెట్లను… భక్తులు నేరుగా తీసుకునే వెసులుబాటు ఉంది.

మ‌రోవైపు టీటీడి ప్రసాదం రేట్లు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం.. తిరుపతిలో భక్తులకు ప్రసాదంగా అందించే జిలేబీ రేట్లు  గతంలో రూ.100లు ఉండగా ప్రస్తుతం రూ.500లకు పెరిగినట్లు దేవస్థానం ప్రకటించింది. అర్జిత సేవలను తిరిగి ప్రారంభించిన తర్వాత ప్రసాదం రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఐతే ఈ గురువారం మాత్రం భక్తులకు ఓపెన్‌ కౌంటర్ల ద్వారా ప్రత్యేకంగా ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేసింది.

Related posts