telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత అభిమానుల్ని నేను ప్రేమిస్తాను : ఆసీస్ కెప్టెన్

ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన ఆసీస్ పర్యటనలో భారత్ 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచింది. 2018-19లో కూడా కోహ్లీసేన అక్కడ సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా పర్యటనలో భారత్ తమను పక్కదారి పట్టించిందని టిమ్‌ పైన్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆటేతర అంశాలతో దృష్టి మళ్లించడంతో తాము ఓటమి పాలయ్యామని చెప్పాడు. అందువల్లే తమ ఏకాగ్రత దెబ్బతిందని, బంతిపై దృష్టి సారించలేకపోయామని తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై భారత మాజీలతో పాటు అభిమానులు మండిపడుతున్నారు. పైన్‌ నిందలు వేస్తున్నాడని విమర్శించారు. ఈ విషయాలు తెలుసుకున్న ఆసీస్ కెప్టెన్ తాజాగా స్పందించాడు. ‘గిల్లీ అండ్ గాస్’ పోడ్కాస్ట్ షో సందర్భంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్, టిమ్ గోసేజ్ పలు విషయాలపై మాట్లాడారు. ఇదే షోలో టిమ్‌ పైన్‌ కూడా పాల్గొన్నాడు. ఆ షోలో పాల్గొన్న నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. టీమిండియాతో ఆడినప్పుడు ఎదురైన సవాళ్ల గురించి అడిగారు. అందులో ఒకటి ఏకాగ్రత చెదరగొట్టిన అంశాలు. వారు బ్రిస్బేన్‌కు వెళ్లరన్నది ఒక రూమర్. తరచూ గ్లోవ్స్‌ మార్చడం, ఫిజియోలు రావడంతో ఏకాగ్రత పోయి.. బంతిపై దృష్టి సారించలేకపోయాం. అయితే భారత్ మమ్మల్ని చిత్తుగా ఓడించిందనీ చెప్పాను. విజయానికి వారు అర్హులని చెప్పాను. భారత అభిమానులు సోషల్‌ మీడియాలో నన్ను విమర్శిస్తున్నారు’ అని టిమ్‌ పైన్‌ అన్నాడు. ‘భారత అభిమానుల్ని నేను ప్రేమిస్తాను. చాలాసార్లు ప్రశంసించేందుకు నేను ఎప్పుడూ వెనుకాడను. నేను క్యాచులు వదిలేసినప్పుడు వారు చెలరేగారు. అందులో తప్పేం లేదనే అంటాను. అభిమానుల్లోని ప్రేమ, అనురాగాన్ని నేను ప్రేమిస్తాను. వారు సానుకూలంగా విమర్శిస్తే ఫర్వాలేదు. కానీ కొందరు నాపై వేలెత్తి చూపుతున్నారు. అయినా ఫర్వాలేదు. వారంటే నాకిష్టమే’ అని ఆసీస్ టెస్ట్ సారథి టిమ్‌ పైన్‌ పేర్కొన్నాడు.

Related posts