telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీలో కరోనా విజృంభణ…

Covid-19

దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైపు కరోనా వణికిస్తుండగా.. ఇంకో వైపు కాలుష్యం భయపెడుతోంది.. వీటికి ఇప్పుడు చలి కూడా తోడైంది.. నెమ్మదిగా విజృంభిస్తున్న చలితో దేశ రాజధానివాసులు వణికిపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించాయి. గత 58 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో దేశ రాజధానిలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో అక్టోబరు 26 వ తేదీన 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత 26 ఏళ్లలో ఢిల్లీలో అక్టోబరు నెలలో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రత ఇది. ఇక ఢిల్లీలో ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 7,745 కొత్త “కరోనా” కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో ఒక రోజు వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదలు. ఇక పెరుగుతున్న చలికి తోడు కొత్త “కరోనా” కేసులు పెరుగుతున్న నేపధ్యంలో టెన్షన్ రేపుతోంది. నిజానికి మార్చి నుంచి మే వరకు కేసులు పెరుగుతూ వచ్చినా, జూన్ నుంచి కేసులు తగ్గిపోయాయి.  అయితే, గత కొన్ని రోజులుగా ఢిల్లీలో తిరిగి కేసులు పుంజుకుంటున్నాయి.  కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం అప్రమత్తం అయ్యింది.  రాష్ట్రంలో కరోనా కేసులు  పెరుగుతున్నాయని, కరోనా కేసుల విస్తరణలో దీన్ని థర్డ్ వేవ్ గా చెప్పవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో పేర్కొన్నారు.  కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యిందని అన్నారు.  పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఢిల్లీలో కేసుల సంఖ్యను పెరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వివరించారు. 

Related posts