ఆదాయ పన్ను శాఖ అధికారుల పేరుతో బాలీవుడ్ హీరోయిన్ ఈషా శర్వాణీని ముగ్గురు బురిడీ కొట్టించారు. తాజాగా నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియన్ ఇన్‌కం ట్యాక్స్ అధికారులమంటూ తమను తాము పరిచయం చేసుకున్న ముగ్గురు వ్యక్తులు పన్ను చెల్లించాలని ఈషాను కోరారు. అది నిజమని నమ్మిన ఆమె.. మూడు లక్షల రూపాయలు వారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ సొమ్మును వెస్టర్న్ యూనియన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన ఆమె.. ఆ తర్వాత తాను మోసపోయినట్టు తెలుసుకున్నారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సైబర్ క్రైమ్ యూనిట్ రంగంలోకి దిగింది. కేసును విజయవంతంగా ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈషా స్వస్థలం ఆస్ట్రేలియాలోని పెర్త్. 2005లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈషా.. ‘లక్ బై ఛాన్స్’, ‘డేవిడ్’, ‘ఖరాబీ ఖరాబీ సింగల్’, ‘కిస్నా’ సినిమాల్లో నటించారు.
previous post
next post

