telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెల్లగా కనిపించే అమ్మాయిలనే ప్రేమిస్తారా ? : హీరోయిన్ ప్రశ్న

Bhumi

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం “బాలా”. అమర్ కౌశిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఈ సినిమాలో భూమి నల్లగా కనిపించే అమ్మాయి పాత్రలో నటించారు. సినిమాలో అందరూ అందంగా కనిపించాలని కోరుకుంటుంటే.. మీరు మాత్రం ఎందుకు నల్లగా కనిపించే క్యారెక్టర్‌లో నటించారు? అని మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు భూమి ఈ విధంగా సమాధానం ఇచ్చింది. “సినిమాలో నేను నల్లగా కనిపించే అమ్మాయి పాత్రలో నటించాను. అయితే మేం నల్లగా ఉన్నవాళ్లని కించపరచడానికి ఈ క్యారెక్టర్ చేయడంలేదు. దేశంలో తెల్లగా కనిపించాలని కోరుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. వారందరికీ బుద్ధి చెప్పడానికే నేను ఈ క్యారెక్టర్‌లో నటించడానికి ఒప్పుకున్నాను. తెల్లగా కనిపించే అమ్మాయిలను మాత్రమే ప్రేమిస్తారా? ఈ సినిమాలో నా క్యారెక్టర్‌పై వస్తున్న ఆర్టికల్స్ అన్నీ చదువుతూనే ఉన్నాను. అందరూ నెగిటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఓ నటిగా ఇచ్చిన క్యారెక్టర్‌కు న్యాయం చేయడం నా బాధ్యత. నేను నటిని కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటిస్తాను. అలా నటించే అవకాశం లేనప్పుడు నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం వేస్ట్. నా ఫస్ట్ సినిమా ‘దమ్ లగాకే హైషా’. ఇందులో నేను చాలా లావుగా ఆంటీలా కనిపిస్తాను. సినిమా కోసం 30 కిలోలు పెరిగాను. లావుగా కనిపించేవారు చాలా మంది ఉన్నప్పుడు సినిమాలో నన్ను మాత్రమే ఎందుకు తీసుకున్నారు? నేను బరువు పెరగాలని ఎందుకు చెప్పారు? ఇదంతా డైరెక్టర్ ఆలోచనలను బట్టి ఉంటాయి. డైరెక్టర్‌కు ఎవర్ని తీసుకోవాలని అనిపిస్తే వారినే తీసుకుంటారు. నా సినిమాలన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. నా పాత్రలు కూడా అంతే. ఒకవేళ నేను సినిమాలో అబ్బాయిలా నటించమన్నా కూడా నాకు ఓకే. సినిమా కోసం ఏదైనా చేస్తాను. మనం చేసే పని ఇంట్రెస్టింగ్‌గా లేనప్పుడు ఆ పని చేయడం ఎందుకు?” అని ఘాటుగా స్పందించింది భూమి.

Related posts