ఓ భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకువస్తోందని సరికొత్త ఆవిష్కరణల కోసం నిత్యం తపించే ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ హెచ్చరించారు. ఆ రాకాసి గ్రహశకలం బ్రహ్మాండమైన శక్తితో భూమిని తాకుతుందని, దీన్నించి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యంకాదని, ఆత్మరక్షణ అసాధ్యమని అన్నారు. దీనిపేరు ‘అపోఫిస్’ అని తెలిపిన ఎలాన్ మస్క్ ప్రస్తుతం ఈ గ్రహశకలం భూమి ఉపరితలానికి 31 వేల కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు.
ఈజిప్టు పురాణాల ప్రకారం ఈ గ్రహశకలం పేరు చాలా గొప్పదని, పేరు సంగతి పక్కనబెడితే దాన్నుంచి ఎదురయ్యే ముప్పు అపారమైనదని వివరించారు. 1100 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గ్రహశకలం భూమిని చేరేది 2029 ఏప్రిల్ 13న అని చెప్పారు. ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ సంస్థను స్థాపించి రోదసిపై తన ఆసక్తిమేరకు ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే ‘స్పేస్ ఎక్స్’ ద్వారా పలు అంతరిక్ష నౌకలను ప్రయోగించారు.


కాంగ్రెస్ బాగుపడాలంటే ఉత్తమ్ తప్పుకోవాలి: రాజగోపాల్రెడ్డి