telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మరో రాజధానిగా హైదరాబాద్.. కేంద్రపాలిత ప్రాంతంగా .. బీజేపీ వ్యూహం..

Least voting city is hyderabad

ఇంటగెలిచి రచ్చ గెలవాలి అన్నచందంగా, దేశంలోనే పెద్ద పార్టీగా గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ దేశరాజధానిలో మాత్రం పాగా వేయలేకపోయింది. దీనితో మరో ప్రణాళికతో పావులు కదుపుతుంది. ప్రస్తుత రాజధానిలో కాలుష్య సమస్య కూడా వారికి కలిసొచ్చింది. దీనితో దేశం మరో రాజధాని వైపు చూస్తుంది. అది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయితే బాగుంటుందని, ఈ దెబ్బతో అటు తెలంగాణకు, ఇటు రాజధానిలో పాగా వేయలేకపోయిన లోటు తీరిపోతాయని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. రాజధాని గా హైదరాబాద్ ను ప్రకటిస్తే, కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం ఖాయం. దీనితో రాజధాని బీజేపీ చేతికి వచ్చినట్టే. ఇక ప్రస్తుత రాజధాని ఢిల్లీలో తీవ్ర కాలుష్యం దృష్ట్యా పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ సమయంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఢిల్లీ లో నెలకొన్న కాలుష్యపరిస్థితులను చూస్తుంటే డా. బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని విద్యాసాగర్ చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే, తెలంగాణకు ఆర్థిక రాజధానిగా ఉన్న వెన్నుముక పోయినట్టే, రాష్ట్రం చిక్కుల్లో పడ్డట్టే. మరోరకంగా ఉపయోగాలు ఉండొచ్చు. రాజధానికి దగ్గరగా ఉన్న రాష్ట్రంగా ఇంకా తొందరగా అభివృద్ధి కూడా జరగవచ్చు. ఇప్పటివరకు దేశంలో ఏ మూలన ఉన్న వారికైనా హైదరాబాద్ అంటే అతితక్కువ కాస్ట్ అఫ్ లివింగ్ అనిపించేది, బహుశా ఇకమీదట అది కుదరకపోవచ్చు కూడా. ఎటు చూసిన ఈ ప్రణాళిక బీజేపీకి కలిసొచ్చేదే. ఇది తెలంగాణ గత ఎన్నికలకు ముందే కేసీఆర్ తో చర్చించి ఒక ఒప్పందానికి వచ్చినా ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే అది బీజేపీ. 

తెలుగు వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చాలా మంది చేసినా .. ఇప్పుడు సాక్షాత్తు బీజేపీ మాజీ గవర్నర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ లో ప్రభుత్వం సరి బేసి విధానాన్ని మళ్ళీ అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానంతో కొంత వరకు కాలుష్యం నుండి బయటపడినా పూర్తి స్థాయిలో మాత్రం గాలి స్వచ్ఛతను అందుకోలేదు . దేశ రాజధానిలో వాయు కాలుష్యం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి బీజేపీ దేశంలో ప్రతి పరిస్థితిని తమకు అనుకూలంగా(రాజకీయాలకోసం) వాడుకోవడం గమనార్షం!

Related posts