తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు దిగటం తో ప్రజలకు కష్టాలు మొదలు, ఇప్పుడు విరమించినా చార్జీల పెంపు నిర్ణయంతో మళ్ళీ కష్టం. ఏది జరిగినా చిల్లు మాత్రం సామాన్యుడికే అన్నట్టు ఉంది పరిస్థితి. కేసీఆర్ కూడా కార్మికులను ఉద్యోగాలలోకి తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. అలాగే తక్షణమే ఆర్టీసీకి రూ. 100 కోట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది. ఇప్పుడు ఆర్టీసీని తిరిగి లాభాల్లో నడిపించాలి అంటే కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచాలి. ఇలా పెంచడం వలన కనీసం సంవత్సరానికి రూ. 790 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయంతో కొంతమేర నష్టాలను పూడ్చుకోవచ్చు.
ఆర్టీసీని నష్టాల నుంచి పూడ్చాలి అంటే ప్రయాణికులపై భారం తోపాటుగా సరకు రవాణా విషయంపై కూడా కొంతమేర దృష్టి పెట్టాలి. అదే విధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ సర్వీసులు నడుపుతున్నారు. ఈ సర్వీసుల కారణంగా ఆర్టీసీకి చాలా వరకు నష్టం వస్తున్నది. ముందు వాటిని అరికట్టాలి. ప్రైవేట్ బస్సులను అదుపుచేయగలిగితే.. ఆర్టీసీకి లాభం వస్తుంది. లాభం రాకపోయినా సరే నష్టాల నుంచి వీలైనంత త్వరగా బయటపడుతుంది.
ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేస్తే సస్పెండ్ చేస్తారా : యనమల