telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆత్మ విస్వాసమే… పెట్టుబడి

కదిలే కాలంతో పోరాడలేక
కల్మషంతోకూడిన మనుషులను
జయించలేక
ఆగని ఆవేదనతో
మనసు వెతలు
తీరవని తెలిసి
జీవనగమనాన్ని సాగించలేక
తనువు సాలించలేని
బంధాలకు బానిసలై
భాధ్యతలు భారమై
అంధకారమే ఆవహించే
వెన్నలకై ఎదురుచూస్తూ
చిరు ఆశని మదిలోనింపుకొని
వీడని దైర్యంతో
ఆత్మ విస్వాసమే
అంకురార్పనగా
ఆలోచనే పెట్టుబడిగా
ఆచరణ సాధ్యమయ్యేలా
సాగిపోవటమే సగటు మనిషి లక్ష్యం …
………………………………..
మనసెరిగిన మనసా
ఎందుకంత తపనా
ఆగవు క్షణమైనా
వదలని ఆలపన
వీడని క్షణాన
అణురాగ జీవితాన
కలలాంటి బ్రతుకున

Related posts