telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మిక సంఘాలు .. కొనసాగుతాయి.. : అశ్వత్థామరెడ్డి

tsrtc union president aswathamareddy on kcr

సీఎం కేసీఆర్ దీక్షా దివస్ గిఫ్ట్‌గా ఆర్టీసీ కార్మికులందరిని రేపటి నుంచి విధుల్లోకి హాజరు కావాలని సూచించారు. ఈ ప్రకారం లిఖితపూర్వక లేఖను అందజేస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తక్షణమే ఆర్టీసీకి వంద కోట్లు మంజూరు చేస్తామన్నారు. అటు ప్రతి డిపో కార్మికులందరితో మాట్లాడి యూనియన్లనేవి లేకుండా చేస్తామనని ఆయన అన్నారు. ఈ తరుణంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. కార్మికులను రేపటి నుంచి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. ఆయన ప్రకటనపై తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. యూనియన్లకు నాయకత్వం వహించాలని తమకు కోరికలు లేవని.. సమస్యలను పరిష్కరిస్తామంటే స్వాగతిస్తామని ఆయన అన్నారు. రెండు రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్న ఆర్టీసీ జేఏసీ.. సమ్మె కారణంగా ఇబ్బంది పడ్డ ప్రజలందరికి క్షమాపణలు చెబుతున్నామన్నారు. పెద్ద మనసుతో ప్రజలు మమ్మల్ని అర్ధం చేసుకున్నారని.. ప్రభుత్వం కూడా తమ బాధ్యత వహించాలని కోరారు.

ప్రభుత్వం ముందే చర్చలకు పిలిచి మాట్లాడి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని.. అంతేకాక ఈ అంశంలో తాము ఓడిపోలేదని.. అలాగని ప్రభుత్వం కూడా గెలవలేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల భవిష్యత్తు గురించి అలోచించి.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేశారు. కేసీఆర్ అనుకున్నట్లు ఆర్టీసీ జేఏసీ తొలిగించడం సాధ్యం కాదని.. కార్మికుల సమస్యల కోసం జేఏసీ ఎల్లప్పుడూ ఉంటుందని కన్వీనర్ వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. యూనియన్లను తీసేసి హక్కు ఎవరికి లేదని.. అలాగని వెల్‌ఫేర్ కమిటీ వస్తే.. మేము తప్పకుండా స్వాగతిస్తామన్నారు. కార్మికులపై వర్క్ లోడ్ పెంచడం వల్లే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఏది ఏమైనా యూనియన్లు కొనసాగుతాయని.. అధికారులే ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారని చెప్పారు.

Related posts