తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ సరిహద్దు మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న వాహనాలు, వ్యక్తుల తనిఖీ నిమిత్తం జైనథ్ మండలం డొలారా వద్ద ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.ఈ తనిఖీల నిమిత్తం వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్, శాఖల సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
తనిఖీలు నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోకి వచ్చే వచ్చే వాహనాలను అనుమతిస్తున్నారు. సొంత రాష్ట్రంలోకి వచ్చే తెలంగాణ వాసులకు 14 రోజుల హోం క్వారంటైన్ స్టాంప్ వేసి పంపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి పాసులు జారీ చేస్తున్నారు. కాగా, జైనథ్ మండలం డొలారా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్ ను కలెక్టర్ శ్రీదేవసేన సందర్శించారు.