తెలంగాణలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల నిబంధనలను కూడా ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో ఇక తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు. రేపటి నుంచి సాధారణంగా పరిస్థితులు ఉండనున్నాయి. రాష్ట్రంలో పాజిటివిటి రేటు తగ్గడంతో వైద్యశాఖ నివేదిక ఇచ్చింది. వైద్యశాఖ నివేదికతో రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ కాకుండా నేరుగా పాఠశాలలు,కళాశాలల్లో తరగతలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి సినిమా థియేటర్లు,పబ్బులు ఓపెన్ కానున్నాయి. బస్సులు,మెట్రో రైళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. అలాగే ఆటోలు,క్యాబ్ లు, ట్యాక్సీలు కూడా అందుబాటులోకి వస్తాయి. రవాణా రంగం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఇక పెళ్లిలు,అంత్యక్రియలకు ఎంత మందైనా హాజరవ్వవచ్చు.
							previous post
						
						
					

